ఎన్టీఆర్ భార్యలో నచ్చని క్వాలిటీ ఇదేనట.. ప్రణతి వల్ల ఇప్పటికీ బాధపడుతున్నాడా..?
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తారక్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏ విషయం అయినా నిర్మొహమాటంగా చెప్పేసే తారక్‌కు తన భార్య లక్ష్మీ ప్రణతిలో ఓ క్వాలిటీ అస్సలు నచ్చదట. దాని వల్ల ఇప్పటికీ బాధపడుతున్నాడని తెలుస్తోంది.
లక్ష్మీ ప్రణతి చాలా భయస్తురాలు ఏది ఓపెన్ గా చెప్పదని టాక్.. ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు ఏమో అని ఆమె ఆలోచిస్తుందట. అందుకే ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా చెప్పకుండా భయపడుతుందట. ప్రణతికి ఎన్నో సంవత్సరాల నుండి తనలోని భయాన్ని పోగొట్టడానికి తారక్ ట్రై చేస్తూనే ఉన్నారట. ప్రతిసారి ఎన్టీఆర్ ఓడిపోతూనే ఉన్నాడు కానీ భార్యలో ఆ క్వాలిటీని మాత్రం మార్చలేకపోతున్నాడని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
More News : చంద్రబాబుని పట్టించుకోని ఎన్టీఆర్.. టీడీపీ ఫ్యూచర్ దబిడి దిబిడే.. పాలిటిక్స్‌లో వైరల్ అవుతున్న ట్వీట్