అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీపై ప్రభాస్ హీరోయిన్ రియాక్షన్ ఇదే.. షాకింగ్ ట్వీట్ వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) కలిసి నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule).

Update: 2024-11-29 06:25 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) కలిసి నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ‘పుష్ప-2’ కోసం అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్‌పై ప్రముఖులు స్పందించి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, ‘పుష్ప-2’ సినిమాపై హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) ‘X’ ద్వారా షాకింగ్ ట్వీట్ చేసింది. అభిమానులతో ముచ్చటించింది.

అయితే ఓ నెటిజన్ ‘పుష్ప-2 గురించి మీరు ఎదురుచూస్తున్నారా నిజాయితీగా సమాధానం చెప్పండి’ అని పోస్ట్ పెట్టాడు. ఇక దానికి మాళవిక స్పందిస్తూ.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) ఎంత అద్భుతంగా నటించాడో. నేను అతని యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఆ స్వాగ్, స్టైల్, అతని డ్యాన్స్ అదిరిపోయాయి. పుష్ప-2 మూవీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇది తగ్గేదేలే సమయం’’ అని రాసుకొచ్చింది.

అంతేకాకుండా ఫైర్ ఎమోజీ షేర్ చేసింది. ప్రజెంట్ మాళవిక ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక ఈ అమ్మడు సినిమా విషయానికొస్తే.. తమిళ, మలయాళ సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మాళవిక ప్రజెంట్ తెలుగులో ఏకంగా పాన్ ఇండియా స్టార్ సరసన నటిస్తుంది. ప్రభాస్(Prabhas), మారుతి(Maruthi ) కాంబోలో రాబోతున్న ‘రాజాసాబ్’(Rajasab) మూవీలో మాళవిక ఆఫర్ అందుకుంది. హారర్, కామెడీతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ‘రాజాసాబ్’(Rajasab) వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

Tags:    

Similar News