పండుగపూట నా కొడుకు చనిపోయాడు.. నువ్వు లేని జీవితం శూన్యం అంటూ త్రిష ఎమోషనల్ పోస్ట్
అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి వావ్ అనిపించుకుంది. అయితే సడెన్‌గా కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి.. యంగ్ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో 8 సినిమాలకు పైనే ఉన్నాయి. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా త్రిష తన ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో ‘ఈ క్రిస్మస్ ఉదయం నా కొడుకు జొర్రో చనిపోయాడు. నాకు బాగా తెలిసిన వారికి తెలుసు వాడు లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానం అని. ఇప్పటికీ నేను, నా ఫ్యామిలీ మెంబర్స్ వాడు లేడనే షాక్‌లోనే ఉన్నాము. నేను మళ్లీ దీని నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది’ అని జొర్రో (కుక్క పిల్ల) సమాధి ఉన్న ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. పలువురు సెలబ్రిటీలు, ఆమె అభిమానులు, నెటిజన్లు రిప్ జొర్రో(RIP Zorro) అంటూ కామెంట్స్ చేస్తున్నారు.