డబ్బులు ఇచ్చి మరీ నాపై అలా చేయించారు.. ఛీ ఇంతలా దిగజారుతారా.. ప్రభాస్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్

‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీలో నాగ చైతన్య(Naga Chaitanya) సరసన నటించిన పూజా హెగ్డే(Pooja Hegde).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

Update: 2025-03-23 04:31 GMT
డబ్బులు ఇచ్చి మరీ నాపై అలా చేయించారు.. ఛీ ఇంతలా దిగజారుతారా.. ప్రభాస్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీలో నాగ చైతన్య(Naga Chaitanya) సరసన నటించిన పూజా హెగ్డే(Pooja Hegde).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అంతేకాకుండా యూత్ మనసులో క్రష్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన చిత్రాలన్నిటిలో నటించి మెప్పించింది. ఇక అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’(Ala Vaikuntapuramlo) సినిమాలోని ‘బుట్టబొమ్మ’(Butta Bomma) సాంగ్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది.

అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించిన ఈ బ్యూటీకి సడెన్‌గా వరుస ప్లాప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ బిరుదుతో పాటు సినిమా చాన్స్‌లు కరువయ్యాయి. దీంతో కొన్ని నెలలు సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఐదు చిత్రాలతో అలరించడానికి మన ముందుకు రానున్నది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ “మీమ్ పేజెస్ వరుసగా నన్ను తిడుతూ పోస్టులు పెట్టాయి. దీంతో నా గురించి కంటిన్యూగా తిడుతున్నారేంటీ అనుకున్నాను. కానీ, ఆ తర్వాత తెలిసింది. నన్ను కావాలనే టార్గెట్ చేసి.. నన్ను కిందకు లాగడానికి కొందరు ఈ రకంగా డబ్బు ఖర్చు చేస్తున్నారని. ఆ సమయంలో నాతోపాటు నా ఫ్యామిలీ కూడా బాధపడింది. మరీ ఇంతకు దిగజారతారా ? అనిపించింది. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ట్రోలింగ్ చేయించారు.

కానీ నేను దానిని ఒక ప్రశంసగా కూడా తీసుకున్నాను ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని కిందకు లాగాలని భావిస్తే వారి కంటే మనం పైనే ఉన్నామని అర్థం కదా. కానీ ఆ పద్ధతి మరింత ఎక్కువైంది. నన్ను ట్రోల్ చేయడానికి లక్షలు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. దీంతో వారి బాధ ఏంటో కనుక్కోమని నా టీంకు చెప్పాను. వాళ్లు ఆ మీమ్ పేజెస్‌ను సంప్రదించగా.. నన్ను తిట్టేందుకు ఫలానా మొత్తం ఇస్తున్నారని చెప్పారు.

ట్రోలింగ్‌ను ఆపేయాలన్నా.. అవతలి వారిని తిట్టాలన్నా మీరు కూడా ఇంత మొత్తం ఇస్తే సరిపోతుందని ఆఫర్ ఇచ్చారు. నాకు మరీ వింతగా అనిపించింది. ఇలాంటి పీఆర్ స్టంట్స్ నాకు నచ్చవు. కొన్నిసార్లు భయంకరంగా కామెంట్స్ పెడతారు. చెడుగా కామెంట్ చేసిన వ్యక్తి ప్రొఫైల్‌కు వెళ్లి చూస్తే అక్కడ ఏమి ఉండదు. కనీసం ఒక ఫొటో కూడా ఉండదు. కేవలం డబ్బు ఆశ చూపించి ఇలాంటివి చేస్తున్నారని ఇట్టే అర్థమవుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News