Game Changer: 'గేమ్ ఛేంజర్'ను బ్యాన్ చేయాలంటూ అక్కడ ఫ్యాన్స్ ఆందోళన.. కారణం అదేనా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) హీరోగా తెరకెక్కిన మూవీ 'గేమ్ ఛేంజర్'

Update: 2025-01-04 03:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) హీరోగా తెరకెక్కిన మూవీ 'గేమ్ ఛేంజర్' (Game Changer) డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసిన ఈ ట్రైలర్ లోని యాక్షన్ సీన్స్ అందర్ని ఆకట్టుకుంటున్నాయి. సినిమా మీద భారీ అంచనాలుండటంతో ఈ ట్రైలర్ రిలీజ్ తో మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, కర్ణాటకలో 'గేమ్ ఛేంజర్' మూవీ పోస్టర్లపై కొందరు స్ప్రే చేయడం షాక్ కి గురి చేసింది.

బ్యాన్ గేమ్ ఛేంజర్ అంటూ పోస్ట్..

" గేమ్ ఛేంజర్ " పోస్టర్‌లో టైటిల్ కన్నడలో ( Kannada ) లేకపోవడం వలన అక్కడి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ ఈ క్రమంలోనే 'బ్యాన్ గేమ్ ఛేంజర్ ఇన్ కర్ణాటక' అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

కారణం అదేనా?

కర్ణాటకలో వారి భాషకి అధిక ప్రాధాన్యత ఉండటంతో, ఇటీవల కొన్ని షాపింగ్ మాల్స్, హోటల్స్‌పై దాడులు జరిగాయి. అలాగే, గేమ్ ఛేంజర్ టైటిల్ ఇంగ్లీష్‌లోనే ఉండటాన్ని కన్నడ వారు తప్పు పడుతున్నారు, టైటిల్‌ను వెంటనే కన్నడలో ముద్రించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మేకర్స్ మాత్రం అవేం పట్టించుకోకుండా కర్ణాటకలోనూ ఇంగ్లీష్ అక్షరాలతో పోస్టర్లు వేశారు. ఈ కోపంతోనే అక్కడి అభిమానులు 'గేమ్ ఛేంజర్' ను బ్యాన్ చేయాలంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి, దీనిలో ఎంత మేరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News