భార్యతో అలా చేస్తున్న ఫొటోతో విషెస్ చెప్పిన టాలీవుడ్ విలన్.. నెట్టింట వైరల్ అవుతోన్న పోస్ట్
ఆంధ్రాలోని మచిలీపట్నంలో పుట్టి పెరిగిన యాక్టర్ రఘురామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దిశ, సినిమా: ఆంధ్రాలోని మచిలీపట్నంలో పుట్టి పెరిగిన యాక్టర్ రఘురామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈయన మొదట గుర్తింపు తెచ్చుకుంది మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే. అక్కడ ఎంటీవీ 'రోడిస్' షోతో బాలీవుడ్ ఆడియెన్స్‌లో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. వీటితో పాటు మరికొన్ని టీవీ షోల్లోనూ మెరిశాడు. ఇక రఘురామ్ మన దక్షిణాది ఆడియెన్స్‌కు మొదటగా పరిచయమైంది శివ కార్తికేయన్ ‘డాక్టర్’ సినిమాతోనే. ఇందులో అతను విలన్ గ్యాంగ్ మెంబర్‌గా నటించాడు. తమిళంతో పాటు ఇటీవల 'కీడాకోలా', 'మెకానిక్ రాకీ' తదితర తెలుగు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు.
ఇక ఈయన సినిమాల సంగతి పక్కన పెడితే.. రఘురామ్ కెనడాకు చెందిన సింగర్ నటాలియాని పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. ఇటీవలే ఐదో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు ఈ లవ్లీ కపుల్. ఈ సందర్భంగా తన భార్యకు లిప్ కిస్ ఇస్తున్న ఫొటోను షేర్ చేస్తూ స్పెషల్ విషెస్ తెలిపారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన వారంతా ఈ విలన్‌కు ఇంత అందమైన భార్య ఉందా? అని, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.