70ఏళ్ల నటుడితో లవ్‌లో పడ్డ హీరోయిన్.. తన ప్రేమ విషయాన్ని తెలుపుతూ పోస్ట్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

సాధారణంగా చాలా మంది ప్రేమికులు ప్రేమకు కులం, మతం, జాతి, రంగు, వయసుతో సంబంధం లేదు అని అనడం మనం వింటూనే ఉంటాం.

Update: 2024-12-18 05:57 GMT

దిశ, సినిమా: సాధారణంగా చాలా మంది ప్రేమికులు ప్రేమకు కులం, మతం, జాతి, రంగు, వయసుతో సంబంధం లేదు అని అనడం మనం వింటూనే ఉంటాం. కానీ రియల్ లైఫ్ లోనూ ఇదే నిజమంటుంది ఓ హీరోయిన్. తన ప్రేమకు వయసుతో అసలు సంబంధం లేదంటోంది. దీంతో ఆ నటి ప్రేమాయణం పై నెటిజన్స్ విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా 31 ఏళ్ల నటి శివంగి వర్మ ప్రముఖ 70 ఏళ్ల నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో ఫొటోను పంచుకుంది. ఆ ఫొటోను షేర్ చేస్తూ.. “ప్రేమకు వయసు, పరిమితులు లేవు” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. అవును ప్రేమకు కావాల్సింది వయసు కాదు డబ్బు అని, నీ తండ్రి ఏజ్‌లో ఉన్న వ్యక్తితో ప్రేమలో పడటానికి సిగ్గు లేదా అంటూ కొంత మంది ఏకిపారేస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని.. ఈ క్రమంలోనే షూటింగ్ సెట్‌లో సరదాగా ఉన్న ఫొటో షేర్ చేసిందని, కేవలం ఇది పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు. కాగా తమపై వస్తున్న ట్రోలింగ్ పై ఇటు శివంగి కానీ అటు గోవింద్ నామ్ దేవ్ కానీ స్పందించలేదు. వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు.

Tags:    

Similar News