Sundeep Kishan: వాలెంటైన్స్ డే కానుకగా ‘మాజాకా’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేస్తుందంటూ మేకర్స్ ట్వీట్..

యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’(Mazaka ).

Update: 2025-02-09 10:09 GMT
Sundeep Kishan: వాలెంటైన్స్ డే కానుకగా ‘మాజాకా’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేస్తుందంటూ మేకర్స్ ట్వీట్..
  • whatsapp icon

దిశ, సినిమా: యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’(Mazaka ). ఈ చిత్రాన్ని ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ యాక్టర్స్ రావు రమేష్(Rao Ramesh), అన్షు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ మాస్ ఎంటర్‌టైన్మెంట్ చిత్రాన్ని ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్(Zee Studios) బ్యానర్స్ పై రాజేష్ దండా(Rajesh Danda), ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. అయితే ‘మజాకా’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్‌ను దక్కించుకుని అంచనాలను పెంచాయి.

ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా ‘మజాకా’ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘మజాకా’ నుంచి వరుస అప్డేట్స్‌ను ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాలోంచి ‘బేబీమా’ రాబోతున్నట్లు తెలుపుతూ ప్రోమో వీడియోను షేర్ చేశారు. ‘‘లవ్ యే లైఫ్ అందామా? Love కి లైఫ్ ఇద్దామా? గెట్ రెడీ.. వాలెంటైన్స్ డే కోసం చార్ట్‌బస్టర్ లవ్ ట్రాక్ లోడ్ అవుతోంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. అయితే ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 10న ఉదయం 11 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మూవీ మేకర్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన సందీప్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News