భార్యకు విడాకులిచ్చి మరీ సమంతతో పెళ్ళికి సిద్ధమైన హీరో!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2023-06-15 15:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఏమాయే చేశాయే సినిమా తర్వాత నాగచైతన్యతో ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. అనంతరం కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు వరుస వెబ్ సిరీస్‌లలో నటిస్తూ సమంత ఫుల్ బిజీగా గడుపుతున్నారు. తాజాగా.. బాలీవుడ్‌లో యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. దీంతో షూటింగ్స్ గ్యాప్‌లో వీరిద్దరు కలిసి షికార్లు కొట్టడం, పబ్‌లకి తిరుగుతూ వార్తల్లో నిలిచారు. దీంతో సమంత, వరుణ్‌ మధ్య ప్రేమయాణం నడుస్తుందేమో అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, సినీ క్రిటిక్ ‘ఉమైర్ సందు’ ఒక సంచలమైన పోస్ట్ పెట్టాడు. ‘వరుణ్ ధావన్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడు’ అంటూ నెట్టింట ఒక పోస్ట్ పెట్టాడు. ఇక ఆ హీరో కూడా సామ్‌ను లవ్‌ చేస్తున్నాడని, సామ్‌ను పెళ్లి కూడా చేసుకుంటాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి:

దాని కోసం ఎన్నో వదులుకోవాల్సి వచ్చింది.. సమంత ఎమోషనల్ పోస్ట్  

51 రాత్రులు RX100 బ్యూటీతో అలాంటి పనులు చేయించిన ప్రముఖ దర్శకుడు!  

Tags:    

Similar News