Ram Charan: రికార్డులన్నీ బద్దలు కొట్టిన గేమ్ చేంజర్ ట్రైలర్.. ఎన్ని వ్యూస్ సాధించిందంటే? (ట్వీట్)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న తాజా సినిమా ‘గేమ్ చేంజర్’(Game Changer).
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న తాజా సినిమా ‘గేమ్ చేంజర్’(Game Changer). దీనిని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) గత నాలుగేళ్ల నుంచి ఊహలకు మించి ఉండేలా రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ మూవీని భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై దిల్ రాజు(Dil Raju), శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలో.. ‘గేమ్ చేంజర్’ ట్రైలర్(Trailer)ను విడుదల చేసి హైప్ పెంచారు. ఇది రిలీజ్ అయినప్పటి నుంచి యూట్యూబ్(YouTube)లో దూసుకుపోతుంది. అంతేకాకుండా విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిసి 180 మిలియన్స్ వ్యూస్ సాధించింది. అంతటితో ఆగకుండా పుష్ప 2, దేవర హిందీ, తమిళ ట్రైలర్ రికార్డుల్ని గేమ్ చేంజర్ ట్రైలర్ కేవలం 15, 16 గంటల్లోనే లేపేసింది. ఈ ట్రైలర్ అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో దుమ్మురేపుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ X ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా రామ్ చరణ్ తెల్ల గుర్రంతో కలిపి పరుగులు పెడుతున్న పోస్టర్(Poster)ను షేర్ చేసి అందరినీ ఫిదా చేస్తున్నారు. ఇక అది చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అదిరిపోయిందని కామెంట్లు పెడుతూ పోస్టర్‌ను నెట్టింట వైరల్ చేస్తు్న్నారు.
180 Million💥
— Sri Venkateswara Creations (@SVC_official) January 4, 2025
Stupendous. Like no other, like never before!🔥
The most talked about, the #GameChangerTrailer✨
🔗 https://t.co/aVIW0HqfLl#GameChanger#GameChangerOnJAN10 🚁
Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman… pic.twitter.com/CyRnwGxj6R