థియేటర్ దగ్గర చిరంజీవిని పరిగెత్తించుకుంటూ పొట్టు పొట్టు కొట్టిన తండ్రి.. కారణం ఏంటంటే?

మెగాస్టార్ చిరంజీవి ఈరోజుతో 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. నేడు చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆయన బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Update: 2024-08-22 08:19 GMT

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ఈరోజుతో 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. నేడు చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆయన బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు కావడం వల్ల అతనికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఓ విషయం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే.. అంత పెద్ద స్టార్ హీరో అయినా చిరంజీవిని తన తండ్రి కొణిదెల వెంకటరావు థియేటర్ దగ్గర నుంచి రోడ్డు మీద వరకు పరిగెత్తించుకుంటూ మరీ కొట్టారట. అసలు అలా కొట్టడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

చిరంజీవి తన 13 ఏళ్ల వయసులో తన తమ్ముడు నాగబాబును తీసుకొని సీనియర్ ఎన్టీఆర్ నటించిన రాము అనే మూవీకి వచ్చారట. అయితే ఆ సినిమా ఆ రోజే రిలీజ్ కావడంతో థియేటర్ దగ్గర జనాల తొక్కిసలాట జరిగింది. ఇక ఈ సినిమాకి ఎలాగోలా టికెట్లు పట్టి చిరంజీవి, నాగబాబు సినిమా చూశారు. ఇక అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది.. ఈ సినిమాకి చిరంజీవి తండ్రి కూడా వచ్చారు. అయితే చిరంజీవిని నాగబాబుని ఎక్కడ చూసారో ఏమో తెలియదు కానీ సినిమా అయిపోయాక బయటకు రావడంతోనే అక్కడే ఉన్న కొబ్బరి మట్టలు విరిగేలా చిరంజీవిని రోడ్డుపై పరిగెత్తించి మరీ పొట్టు పొట్టు కొట్టారట.

ఏంటి అంత పెద్ద స్టార్ హీరోని అలా రోడ్డు మీద కొట్టడం ఏంటి అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటే అప్పటికీ చిరంజీవి ఏజ్ 13 ఏళ్లేనట. ఇక ఆ టైంలో నాగబాబు వయసు ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అంత చిన్న పిల్లవాడిని వెంటేసుకొని నువ్వు సినిమా చూడడానికి వచ్చావా.. ఈ జనాల తొక్కిసలాటలో మీ ఇద్దరికీ ఏమైనా అయితే ఏం చేస్తావ్ అని కొబ్బరి మట్ట విరిగేలా కొట్టారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ఓ ఈవెంట్‌లో బయట పెట్టారు. అంతేకాదు ఇప్పటికీ ఏవీఎం రాము సినిమా గుర్తుకు వస్తే చిరంజీవికి నాగబాబుకి ఒంట్లో వణుకు పుడుతుందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

Full View

 (video link credits to mana stars youtube channel)

 


Tags:    

Similar News