Rajinikanth: సూపర్ స్టార్ సినిమాలోకి అందాల గనిని దింపుతున్న డైరెక్టర్.. హైప్ పెంచుతున్న న్యూస్
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) గత ఏడాది ‘జైలర్’(Jailer) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) గత ఏడాది ‘జైలర్’(Jailer) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది ‘వెట్టైయాన్’తో ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం లోకేష్ కనగరాజ్బ డైరెక్షన్‌లో ‘కూలీ’ చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ క్రమంలోనే.. రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) తెలిపారు. అయితే కూలీ షూటింగ్ అయిపోగానే ఇందులో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, జైలర్-2 కోసం ఓ క్రేజీ బ్యూటీని నెల్సన్ దింపుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ చిత్రంతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty)ని సూపర్ స్టార్ సినిమాలో తీసుకోనున్నట్లు సమాచారం. ఇందులో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. శ్రీనిధితో పాటు తమన్నా భాటియా(Tamannaah Bhatia) కూడా ఇందులో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లలో అంచనాలు పెరిగిపోయాయి.
Read More..
ఆ స్టార్ హీరోతో ఆ పని చేయాలన్న కోరిక నెరవేరింది.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్