Balakrishna: కూతురు వయసున్న నటితో ఏంటా పని.. దబిడి దిబిడి సాంగ్‌పై దారుణమైన ట్రోల్స్

నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj).

Update: 2025-01-03 12:22 GMT

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). బాబీ కొల్లి డైరెక్ష్న్ రాబోతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ విడుదల అవుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన దబిడి దిబిడే ఐటమ్ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాట విడుదలైనప్పటి నుంచి టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అలాగే ట్రోలింగ్ కూడా గురవుతోంది.

64 ఏళ్ల బాలయ్య తన కూతురు వయసున్న 30 ఏళ్ల ఊర్వశి(Urvashi Rautela)తో చెండాలమైన స్టెప్పులేయడంతో పాటు వికృత చేష్టలు చేశారని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. డ్యాన్స్ కంటే ఎక్కువగా ఆమెను కొట్టడమే ఉందని ఇంత ఘోరంగా ప్రవర్తించమేంటని మండిపడుతున్నారు. కొరియోగ్రఫీ చాలా దరిద్రంగా ఉందని ఫైర్ అవుతున్నారు. దయచేసి ఈ పాటను డిలీట్ చేయడంని నెటిజన్లు కొందరు వేడుకుంటున్నారు. కానీ బాలయ్య అభిమానులు మాత్రం ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అది సినిమాలా చూడాలని అంటున్నారు.  

Tags:    

Similar News