‘తండేల్’ సెకెండ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. డ్యాన్స్‌తో హైప్ పెంచేసిన చైతన్య, సాయిపల్లవి
అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి కాంబోలో వస్తున్న మూవీ ‘తండేల్’.
దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి కాంబోలో వస్తున్న మూవీ ‘తండేల్’. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇక లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. నమో నమ నమో నమ శివాయ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోని ఈరోజు రిలీజ్ చేశారు. ఇందులో సాయి పల్లవి, నాగ చైతన్యలు తమ డ్యాన్స్‌తో మొత్తం డివైన్ వాతావరణాన్ని క్రియేట్ చేసేశారు. ప్రస్తుతం ఈ పాట ప్రోమో నెట్టింట ఆకట్టుకుంటుంది.