Sukumar: సినిమాలు మానేస్తానంటూ సుకుమార్ షాకింగ్ కామెంట్స్.. ‘పుష్ప-2’ ఎఫెక్ట్ అంటున్న నెటిజన్లు! (వీడియో)

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు.

Update: 2024-12-24 08:00 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక(Rashmika Mandanna) జంటగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా కలెక్షన్లు కూడా భారీగా రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. అయితే పుష్ప-2 ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది.

ఎందుకంటే.. విడుదలకు ముందు ప్రీమియర్స్ వేయగా విషాద సంఘటన చోటుచేసుకుంది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడంతో అక్కడికి అత్యధిక మంది అభిమానులు వచ్చి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడు. ఆ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చాడు కానీ మరోసారి పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’(Game Changer) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళ్లిన సుకుమార్(Sukumar) షాకింగ్ కామెంట్స్ చేశారు.

అమెరికాలో జరిగిన ఈ వేడుకలో యాంకర్ సుమ సుకుమార్‌ను దోప్ అనే పదంతో ఒకటి వదిలేయా అంటే ఏది వదిలేస్తారు? అని అడగ్గా.. ‘‘సినిమాలు చేయడం మానేస్తాను’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాక్ అయి అలా ఏం జరగదు అని సైగలు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు పుష్ప-2 వల్ల అల్లు అర్జున్ వివాదాలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఆయన మానసిక ఒత్తిడికి గురవుతూ ఇలా అన్నాడని అంటున్నారు.

Tags:    

Similar News