ఆమెతో సుధీర్ నిశ్చితార్థం.. పదేళ్ల ప్రయాణం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మి

బుల్లితెర నటుడు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షో తో ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. కమెడియన్‌గా కెరీర్ మొదలు పెట్టి యాంకర్‌గానూ సత్తా చాటాడు.

Update: 2023-07-01 06:27 GMT

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర నటుడు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షో తో ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. కమెడియన్‌గా కెరీర్ మొదలు పెట్టి యాంకర్‌గానూ సత్తా చాటాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. అయితే యాంకర్ రష్మితో ల్‌లో ఉన్నాడని పలు వార్తలు రావడంతో ఫ్యాన్స్‌లో ఫుల్ పాపులారిటీ వచ్చింది. పలు షోస్‌లో ఆన్‌స్క్రీన్‌పై వీరి పెళ్లి కూడా జరిగింది. నిజ జీవితంలో కూడా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల సుధీర్ తన మరదలితో ఏకంగా నిశ్చితార్థం చేసుకుని రష్మికి షాకిచ్చాడంటూ ఓ వార్త వైరల్‌గా మారింది.

ఈ క్రమంలో రష్మి గతంలో సుధీర్‌తో ప్రేమ వ్యవహారం గురించి చేసిన కామెంట్స్ మళ్లీ వైరల్ మారుతున్నాయి. రష్మిని మీ ఇద్దరి మధ్య ఉండేది ఎలాంటి బంధం అని యాంకర్ అడగ్గా.. ఆమె స్పందిస్తూ ‘‘ మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటాను. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేము ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉంటామో.. అదే ఆన్‌స్క్రీన్‌పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. మేము అనుకుని అదంతా చేయలేదు. ఓ మ్యాజిక్‌లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది’’ అంటూ రష్మి చెప్పుకొచ్చింది.

Read More:   పబ్లిక్‌గా బాయ్ ప్రెండ్‌తో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు?

Tags:    

Similar News