Squid Game Season 2: స్క్విడ్ గేమ్ 2 రిలీజ్‌..   సీజ‌న్ 1 కు మించి ఉందంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్

నాలుగు వారాల్లో 1.6 బిలియన్ వ్యూస్ వచ్చాయి

Update: 2024-12-28 06:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : స్క్విడ్ గేమ్ సీజ‌న్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగు వారాల్లో 1.6 బిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికి కూడా ఈ సీజన్ క్రేజ్ ఇంకా తగ్గలేదు. అయితే, యువ‌త ఎంత‌గానో వేచి చూస్తున్న స్క్విడ్ గేమ్ సీజ‌న్ 2 ( Squid Game Season 2 ) రానే వ‌చ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 26 న మ‌ధ్యాహ్నం 12.30కి విడుదలైంది.

కొరియ‌న్ మూవీస్ కి యూత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ డ్రామాస్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా, ఓటీటీలోకి పెరిగిన త‌ర్వాత కొరియ‌న్ మూవీస్ చూసే వారి సంఖ్య విప‌రీతంగా పెరిగింది. ప్రతీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోఈ సినిమాలకు డ్రామాస్ పేరుతో సప‌రేట్ క్యాట‌గిరీ ఉంది. కొరియ‌న్ వెబ్ సిరీస్‌ల‌లో కొన్ని వరల్డ్ వైడ్ గా ఫేమ‌స్ అయ్యాయి. వీటిలో స్క్విడ్ గేమ్ సీజ‌న్ 1, క్వీన్ ఆఫ్ టియర్స్ , ది స్వాన్ వంటి అనేక‌ సిరీస్‌లు బాగా పాపులర్ అయ్యాయి. ఇక 2021లో వ‌చ్చిన థ్రిల్ల‌ర్ సిరీస్‌ స్క్విడ్ గేమ్ 1 గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇది పెద్ద హిట్ అవ్వడంతో ఈ ఏడాది మొద‌ట్లో స్క్విడ్ గేమ్ 2 రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డంతో సినిమా ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా వేచి చూశారు .. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇప్పుడు, ఎక్క‌డ చూసినా ఈ సిరీస్ గురించే మాట్లాడుకుంటున్నారు. స్క్విడ్ గేమ్ (  Squid Game 1 ) కు మించి ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Tags:    

Similar News