ఆ హీరోయిన్‌తో సినిమా చేయకని అల్లు అర్జున్‌కు వార్నింగ్ ఇచ్చిన స్నేహరెడ్డి!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహరెడ్డిల దంపతుల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

Update: 2023-10-26 07:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహరెడ్డిల దంపతుల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వీరిద్దరికీ అర్హ, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. స్నేహారెడ్డి మాత్రం పిల్లలతో పాటు పలు బిజినెస్‌ వ్యవహారాలను కూడా చూసుకుంటుంది. షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీ మొత్తం వెకేషన్‌కి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు.

తాజాగా, అల్లు అర్జున్‌కు స్నేహా ఆమెతో సినిమాల్లో నటించొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు వార్త వైరల్ అవుతోంది. ఆమె మరెవరో కాదు రకుల్ ప్రీత్‌సింగ్, అల్లు అర్జున్ కలిసి సరైనోడు మూవీలో నటించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, రకుల్ ఫ్రెండ్స్ అయ్యారట. అంతేకాకుండా రకుల్ ప్రతి రోజూ ఫోన్ చేసి ఆయనతో గంటల తరబడి మాట్లాడేదట. పార్టీల్లో కలిసినప్పుడు చాలా చనువుగా ఉండేదని తెలుస్తోంది. దీనిపై అప్పట్లో నెట్టింట పెద్ద చర్చలు జరిగాయి. దీంతో ఇవన్నీ చూసిన స్నేహ రెడ్డి ఆమెతో నటించకని వార్నింగ్ ఇచ్చిందట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ మరోసారి ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News