సిద్ధార్థ్ ‘మిస్ యు’ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మూవీ మేకర్స్

హీరో సిద్దార్థ్(Siddharth) వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Update: 2024-12-03 04:25 GMT

దిశ, సినిమా: హీరో సిద్దార్థ్(Siddharth) వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గత ఏడాది ‘చిన్నా’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన అదే ఫామ్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్ యు’(Miss you). కోలీవుడ్ డైరెక్టర్ రాజశేఖర్(Rajasekhar) తెరకెక్కించిన ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే దీనిని 7 మిల్స్ పర్ సెకండ్ బ్యానర్ పై శ్యామ్యూల్ మ్యాథ్యూ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ సినీ ప్రియులను ఫిదా చేశాయి. అయితే ‘మిస్ యు’ మూవీ నవంబర్ 29న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే చిత్రబృందం వాయిదా పడినట్లు వెల్లడించారు. కానీ మరో డేట్‌ను అనౌన్స్ చేయలేదు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సిద్దార్థ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘మిస్ యు’ సినిమా కొత్త రిలీజ్ డేట్‌(Release date)ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. డిసెంబర్ 13న విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ సిద్దార్థ్, అషికా కలిసి ఉన్న ఫొటోను నెట్టింట పెట్టారు. అలాగే ‘‘కొద్దిసేపు విరామం తర్వాత, మిస్ యూ మీ హృదయాలను ఆకర్షిస్తుంది. మాయాజాలం డిసెంబర్ 13న ప్రారంభమవుతుంది.. మిస్ అవ్వకండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News