Shobhitha: ‘నాగచైతన్య నా వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు’.. అక్కినేని కోడలు ఎమోషనల్ కామెంట్స్!

అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభితతో డేటింగ్‌లో ఉంటూ ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.

Update: 2024-12-18 02:29 GMT

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభితతో డేటింగ్‌లో ఉంటూ ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున ఎక్స్ వేదికగా తెలియజేస్తూ వారి నిశ్చితార్థ ఫొటోలను షేర్ చేశాడు. అయితే ఈ జంట రీసెంట్‌గా డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో చైతన్య పై శోభిత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత ధూళిపాళ తమ ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘నేను నాగార్జున గారి ఇంట్లోకి 2018వ సంవత్సరంలో అడుగుపెట్టాను. కానీ నాకు, చైతన్యకి మధ్య 2022లో స్నేహం ఏర్పడింది. తనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం ఎప్పుడు కలిసినా మా మధ్య ఫుడ్ గురించి మాత్రమే డిస్కషన్ అయ్యేది. అయితే నేను నార్త్ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నాను. నాగ చైతన్యతో కూడా నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆయన కోపం తెచ్చుకునేవారు. తెలుగులో మాట్లాడమని చెప్పేవారు. అలా తెలుగులో ఇద్దరం మాట్లాడుకోవడం వల్ల మా మధ్య బంధం బలపడింది. మా ఇద్దరి మధ్య పరిచయం తొలిసారి ముంబైలోని ఒక కేఫ్‌లో స్టార్ట్ అయింది. అప్పట్లో నేను ముంబైలో, చైతన్య హైదరాబాద్‌లో ఉండేవాళ్లం. నన్ను కలవాలంటే నాగ చైతన్య ముంబైకి రావాల్సి వచ్చింది.

అప్పట్లో నాకు షూటింగ్స్ ఎక్కువగా ముంబైలోనే ఉండటం వల్ల నేను హైదారాబాద్‌కి రాలేకపోయాను. కానీ, పాపం చైతూ నా కోసం చాలా ఇబ్బందులు పడుతూ వచ్చేవాడు. ఫస్ట్ టైం మేమిద్దరం బయటకు వెళ్లేటప్పుడు నేను రెడ్ డ్రెస్ వేసుకుంటే, నాగ చైతన్య బ్లూ షూట్ వేసుకొచ్చాడు. కర్ణాటకలో కూడా మేము అనేక పార్కుల్లో తిరిగాము. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకుని ముచ్చట పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కి కూడా ఇద్దరం కలిసి వెళ్లాము’ అని శోభిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు.. సైలెంట్‌గా కనిపించే నాగ చైతన్య ఇంత తతంగం నడిపాడా.. పాపం సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News