Sobhita Dhulipala: హల్దీ ఫొటోలు షేర్ చేసిన శోభిత.. చైతు మాయలో పడకు బాధ పడతావంటున్న నెటిజన్లు

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita Dhulipala ) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-01 03:05 GMT

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita Dhulipala ) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి డేటింగ్ చేసిన వీరిద్దరు ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చారు. డిసెంబర్ 4న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో వీరిద్దరి పెళ్లి జరగనుంది. అయితే ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ క్రమంలోనే.. చైతు, శోభితకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, అక్కినేని ఇంటికి కాబోయే కోడలు శోభిత హల్దీ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో షేర్ చేసింది. ‘‘రాటా.. తపన.. మంగళ స్నానం’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రజెంట్ శోభిత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు చైతు మాయలో పడకు అంత సంతోష పడిపోకు కచ్చితంగా బాధపడతావు అని కామెంట్లు పెడుతున్నారు.

మరికొందరు మాత్రం కంగ్రాట్స్(Congratulations) చెప్పడమే కాకుండా సమంత(Samantha)ను మధ్యలో తీసుకువచ్చి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కాగా, నాగచైతన్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరి కాపురం ఎక్కువ కాలం నిలువలేదు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది.

Full View

Tags:    

Similar News