Salman Khan: ‘సికందర్’ మూవీ టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడే.. నెట్టింట వైరల్ అవుతున్న రన్ టైమ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వంలో ‘సికందర్’(Sikander) మూవీ చేస్తున్నారు. అయితే రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుంది. దీనిని నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Grandson Entertainments) బ్యానర్‌పై సాజిత్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఇందులో సత్యరాజ్(Satyaraj) కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
సికందర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈద్ కానుకగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 27న సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్నట్లు టాక్. అయితే దీనికి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మొత్తం 1 నిమిషం 45 సెకండ్లు ఉంటుందట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.