Salman Khan: సల్మాన్ ఖాన్ బర్త్ డే స్పెషల్.. ‘సికందర్’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ విడుదల
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’(Sikander).
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’(Sikander). దీనిని ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Nadiadwala Grandson Entertainments) బ్యానర్‌పై సాజిత్ నడియాద్వాలా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో సత్యరాజ్(Satyaraj), కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి(Suniel Shetty), శర్మాన్ జోషి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ఈద్ స్పెషల్‌గా విడుదల కానుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘సికందర్’ మూవీ నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. నేడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ‘సికందర్’ టీజర్‌ను విడుదల చేసి బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ సల్మాన్ మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రేక్షకులకు నచ్చతుందనుకుంటున్నా అని రాసుకొచ్చారు. అయితే టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తుండగా.. సల్మాన్ తన యాక్షన్‌తో అదరగొట్టారు. గన్ పట్టుకుని మాస్ అవతార్‌లో కనిపించారు. ఇక ఈ టీజర్ చూసిన నెటిజన్లు బీజియమ్, డైలాగ్స్ సూపర్‌గా ఉన్నాయంటూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.
Read More..