Sai Pallavi: ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్‌పై సాయిపల్లవి షాకింగ్ కామెంట్స్.. అలా చేసుకోవడం మహాపాపం అంటూ
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేమమ్(Premam) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈమె డ్యాన్స్(Dance)కు అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పోచ్చు. అలాగే సినిమాల్లో మినిమల్ మేకప్, బోల్డ్ సీన్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో ఈ అమ్మడుకు ఇంకా మంచి ఫేమ్ వచ్చింది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘తండేల్’(Tandel) మూవీతో పాటు రణబీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణం’(Ramayanam) చిత్రంలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. కులాంతర వివాహాల గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. బాల్యంలో మా కుటుంబం కులాల పరిధిలోనే వివాహాలు చేసుకోవాలని కోరింది. అలా కాకుండా వేరే క్యాస్ట్ వాళ్లను పెళ్లి చేసుకుంటే అది మహాపాపంలా భావించేవారు. కానీ, నా చుట్టూ ఉన్న వారు ఇప్పుడిప్పుడే కులాంతర వివాహాలు చేసుకొని సంతోషంగా ఉన్నారు. అయితే, ఆ వ్యక్తులు తమ ఫ్యామిలీ నుండి దూరంగా ఉన్నారు. ఎందుకంటే మా కులం ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్‌ను అంగీకరించదు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత నాకు ప్రజల గురించి తెలియడం మొదలైనది. నాకు కూడా కులాంతర వివాహం చేసుకోవాలనే ఉంది అని సాయి పల్లవి తన కోరికను వెల్లడించింది. దీంతో ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సాయి పల్లవి ఎవరిని లవ్ చేస్తుందా అని తెగ సెర్చ్ చేసేస్తున్నారు.