RGV: ‘మార్కో’ సినిమా కలెక్షన్లు తెలిసి కొందరు భయపడుతున్నారు.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) చాలా ఏళ్ల తర్వాత ‘శారీ’(Saree) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2025-01-04 12:34 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) చాలా ఏళ్ల తర్వాత ‘శారీ’(Saree) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు ట్వీట్స్‌తో సంచలనం సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఆర్జీవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘మార్కో’(Marco) సినిమాపై ట్వీట్ చేశారు. ‘‘అల్ట్రా లోబడ్జెట్ ఫిల్మ్ ‘మార్కో’(Marco) దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా మెగా బడ్జెట్ స్టార్ స్టడెడ్ చిత్రాలను తన్నుతోంది.

ఉన్నిముకుందన్(Unnimukundan) స్క్రీన్‌పై విలన్‌లను కొట్టడమే కాకుండా, బాలీవుడ్‌లోనే కాదు, అన్ని ఇండస్ట్రీల్లో నిర్మాతలు(Producers), నటీనటులు, దర్శకుల(Director's) మనస్సులను కూడా కొట్టేస్తున్నాడు. అంతా ఇప్పుడు ‘మార్కో’ కలెక్షన్స్ గురించి భయపడి పరుగులు తీస్తున్నారు. ఈ సినిమాకు పెట్టిన ఖర్చుతో పోల్చితే దాని లాభాలు తెలుసుకుని చాలా మంది గుండెపోటుతో మరణిస్తారు’’ అని తనదైన స్టైల్లో రాసుకొచ్చారు. కాగా, మలయాళ ఉన్ని ముకుందన్, హనీఫ్ అదేని కాంబోలో వచ్చిన లేటెస్ట్ చిత్రమే ‘మార్కో’.

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Cubes Entertainments) బ్యానర్‌పై షరీష్ మహమ్మద్ నిర్మించారు. అయితే ఇందులో యుక్తి తరేజా, కబీర్ దుహాన్ సింగ్(Kabir Duhan Singh) కీలక పాత్రల్లో కనపించారు. ఈ మూవీ మొదట కేరళలో డిసెంబర్ 20న విడుదలై సంచలన విజయం సాధించి బాక్సాఫీసును షేక్ చేసింది. ఇక తెలుగులో జనవరి 1 విడుదలవగా.. తమిళ వెర్షన్ జనవరి 3న థియేటర్స్‌లోకి వచ్చింది. అన్ని భాషల్లో రిలీజ్ అయిన ‘మార్కో’ మోస్ట్ వైలెంట్ సినిమాగా నిలిచింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది.

Tags:    

Similar News