Chiyan Vikram: విక్రమ్‌తో జతకట్టబోతున్న యంగ్ బ్యూటీ.. కాంబో అదుర్స్ అంటున్న నెటిజన్లు
యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan ) నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan ) నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది మరోసారి నాని సరసన ‘సరిపోదా శనివారం’(Saripodhaa Sanivaaram), మూవీతో ప్రేక్షకులను అలరించింది. కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. కానీ ధనుష్ సరసన నటించిన ‘కెప్టెన్ మిల్లర్’(Captain Miller) మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘ఓజీ’ నటిస్తుంది.
సుజిత్(Sujith) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా మార్చి 27న థియేటర్స్‌లోకి రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రియాంక అరుళ్ మోహన్, చియాన్ విక్రమ్(Chiyan Vikram) సరసన నటించే అవకాశం అందుకున్నట్లు సమాచారం. విక్రమ్ 63 పేరుతో రాబోతున్న ఈ సినిమాకు మడోన్నా అశ్విన్(Madonna Ashwin) దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ(Arun Vishwa) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వావ్ సూపర్ జోడీ అంటున్నారు.
#BREAKING: #PriyankaMohan is in Talks To Play Female Lead Opposite #ChiyaanVikram in #Chiyaan63 Directing By #Mandela & #Maaveeran Fame #MadonneAshwin 😎🔥 #VeeraDheeraSooran Getting READY For Release🔥🤙 pic.twitter.com/dMn3GikcQz
— OTT STREAM UPDATES (@newottupdates) January 5, 2025