దేవుడు లేడు అత్యాశే ఉంది.. వినాయక చవితి సెలబ్రేషన్స్‌పై రేణూ దేశాయ్ సంచలన కామెంట్స్
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renudesai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా(Deputy CM) వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’(Tiger Nageswarao) మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు(poor children), జంతువులకు(animals ) సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ గ్రేట్ హ్యూమన్ బీయింగ్(Great human being) అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఆమె వినాయక చవితి సెలబ్రేషన్స్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మాట్లాడుతూ.. “ఇప్పుడు అందరూ కూడా స్థాయిని చాటుకోవడం కోసం.. పెద్ద పెద్ద విగ్రహాలు, ఎక్కువ డెకరేషన్ అంటూ సెలబ్రేషన్స్ చేస్తున్నారు.. నిజానికి అందులో దేవుడు లేడు.. మనిషి దురాశ.. అత్యాశ మాత్రమే ఉంది” అంటూ రేణూ దేశాయ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమ్ము దుమారం రేపుతున్నాయి. కాగా రేణు దేశాయ్ వినాయక చవితి పండుగను రాను రాను దేవుడి స్థాయిని దిగజార్చేలా.. హీరో హీరోయిన్ల గెటప్పుల్లో విగ్రహాలను పెట్టడంపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.