Ram Gopal Varma: ‘శారీ’ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తూ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇండస్ట్రీలో తనదైన స్టైల్లో సినిమాలు తెరకెక్కిస్తూ సంచలనం సృష్టిస్తుంటారు.
దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇండస్ట్రీలో తనదైన స్టైల్లో సినిమాలు తెరకెక్కిస్తూ సంచలనం సృష్టిస్తుంటారు. అంతేకాకుండా డిఫరెంట్ కంటెంట్‌లతో, నిజజీవిత సంఘటనల ఆధారంగా కొత్త వారితో ప్రయోగాలు చేయడంలోనూ ఆయన ముందుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న రామ్ గోపాల్ వర్మ ‘శారీ’(Saaree) మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఆరాధ్య దేవి(Aaradhya Devi), సత్య యాదు జంటగా నటిస్తున్నారు. దీనిని రవివర్మ(Ravi Varma) నిర్మిస్తున్నారు. అయితే పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘శారీ’ రాబోతుంది.
ఈ సినిమా నవంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ద్వారా ఓ ట్వీట్ చేశారు. ‘‘పుష్ప-2కి ఉన్న మెగా క్రేజ్ అల్లు కొత్త మెగా అని చెప్పడానికి స్పష్టమైన రుజువు ఇదే. అల్లు అర్జున్(Allu Arjun) మీరు బాహుబలి కాదు మెగాబలి’’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా ‘శారీ’ సినిమా వచ్చే ఏడాది జనవరి 30న తెలుగు, హిందీ, తమిళ, మలయాళంలో విడుదల కాబోతున్నట్లు ఓ భయంకరమైన పోస్టర్‌ను విడుదల చేశాడు. అలాగే ఇందులో ‘‘అతి ప్రేమ భయానకంగా ఉంటుంది’’ అని రాసి ఉంది. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ‘పుష్ప-2’ కు భయపడి ‘శారీ’ చిత్రాన్ని వాయిదా వేశాడని అంటున్నారు.