తమ గారాల పట్టితో క్రిస్మస్ జరుపుకున్న రామ్ చరణ్- ఉపాసన.. పోస్ట్ వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కామినేని ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-26 04:27 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కామినేని ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యారేజ్ అయిన దాదాపు 11 సంవత్సరాలకి వీరికి ఓ పాప పుట్టింది. ఆ చిన్నారికి క్లీంకార అనే నామకరణం కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ పాప ఫేస్‌ని మాత్రం రివీల్ చేయలేరు. కానీ ఆ లిటిల్ ప్రిన్సెస్‌తో ఉన్న ఫొటోలను మాత్రం ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తునే ఉంటుంది.. కాకపోతే ఫేస్ కనపడకుండా ఎమోజీలతో కవరప్ చేస్తుంటది. దీంతో చిన్నారి క్లీంకారను ఎప్పుడెప్పుడు చూపిస్తారా అంటూ మెగా అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో మెగా ప్రిన్సెస్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఉపాసన క్రిస్మస్ సందర్భంగా తన పనివాళ్ళతో సెలబ్రేషన్స్ చేసుకుంది. అలాగే తన గారాల పట్టి అయినా క్లీంకారాతో ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. అయితే ఈ పిక్‌లో క్లీంకార ఫేస్ మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు మళ్లీ మిస్ క్లీంకార ఫేస్ అని, హ్యాపీ క్రిస్మస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News