ప్రముఖ రచయిత కన్నుమూత.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎమోషనల్ పోస్ట్..?

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2025-03-18 04:09 GMT
ప్రముఖ రచయిత కన్నుమూత.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎమోషనల్ పోస్ట్..?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్‌గానే మలయాళ ప్రముఖ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ (Author Mankombu Gopalakrishnan) చనిపోయారు. గత కొన్ని రోజులుగా గోపాలకృష్ణన్ అనారోగ్య సమస్యలతో బాధపడి.. నిన్న (మార్చి 17) మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు.

కార్డియాక్ అరెస్ట్ (Cardiac arrest) కారణంగా మంకొంబు గోపాలకృష్ణ ప్రాణాలు కోల్పోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికన సంతాపం తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Tollywood famous director Rajamouli) ట్విట్టర్ వేదికన మంకొంబు గోపాలకృష్ణన్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

‘‘ప్రముఖ మలయాళ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ సర్ మరణవార్త విని బాధగా ఉంది. ఆయన కలకాలం గుర్తుండిపోయే సాహిత్యం, కవిత్వం, సంభాషణలు శాశ్వత ముద్ర వేశాయి. ఈగ, బాహుబలి (Bahubali), ఆర్ఆర్ఆర్ (RRR) మలయాళ వెర్షన్లలో ఆయనతో కలిసి పనిచేసినందుకు కృతజ్ఞతలు. ఓం శాంతి’’.

అని జక్కన (Jakkana) సోషల్ మీడియా వేదికన రాసుకొచ్చారు. ఇక ఈ రచయిత ఏకంగా 200 చిత్రాల్లో ఏడు వందలకు పైగా సాంగ్స్ రాసి మంచి పేరు దక్కించుకున్నారు. అంతేకాకుండా డైలాగ్ రైటర్‌గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోగా వచ్చిన యానిమల్ చిత్రానికి మలయాళం వెర్షన్‌లో సాంగ్స్ రాశారు. 

Tags:    

Similar News