దిశ, వెబ్‌డెస్క్: 'రాధేశ్యామ్' విడుదల విషయంలో సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాకు ఆ డేట్ ఫిక్స్ చేశారు, ఈ డేట్ ఓకే చేశారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మూవీ టీం సన్నిహితుల నుంచి మాత్రం మేకర్స్ ఒక డేట్‌పై దృష్టి పెట్టారని, దాదాపు ఆ డేట్‌నే ఓకే చేయాలని చూస్తున్నారట. 'రాధేశ్యామ్' సినిమా కోసం ప్రభాస్ అభిమానులు చాలా కాలంగా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని, వారికి సినిమా రిలీజ్‌తో నెవ్వర్ బిఫోర్ అనేలా ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అందుకే కరోనా కంట్రోల్ అయితే మూవీనీ మార్చి11న రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మరి ఈ విషయంపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.