Pushpa-2: పుష్ప-2 ట్రైలర్ విడుదల.. మాస్ జాతరే (వీడియో)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప-2(Pushpa-2) ట్రైలర్ విడుదలైంది.
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప-2(Pushpa-2) ట్రైలర్ విడుదలైంది. బిహార్(Bihar)లోని పాట్నా వేదికగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఊర మాస్ అవతారంలో అల్లు అర్జున్ మరోసారి రచ్చ చేశారు. ముఖ్యంగా ఆ జాతర సీన్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయంగా తెలుస్తోంది. రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్(Fahadh Faasil) మరోసారి తనదైన స్టైళ్లో అదరగొట్టారు.
సునీల్, అనసూయ, జగపతి బాబు లుక్స్ కూడా అదిరిపోయాయి. చివర్లో ‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్ బ్రాండ్’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ హైప్ ఎక్కిస్తోంది. మోస్ట్ టాలెండర్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రవి శంకర్, నవీన్ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ట్రైలర్‌ను వీక్షించిన ఫ్యాన్స్ అంతా ఆగలేకపోతున్నామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ ట్రైలర్ ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.
Read More...
Bandla Ganesh: పుష్ప-2 ట్రైలర్‌పై బండ్ల గణేష్ రియాక్షన్