Pushpa-2: చరిత్ర సృష్టించిన 'పుష్ప-2'.. 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’.
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదల అయి 12 రోజులు కావొస్తున్నా కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. ‘పుష్ప-2’ సినిమా నిన్న రూ.104 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రిలీజైన 11వ రోజున రూ. 100+ కోట్లు రాబట్టిన తొలి భారతీయ సినిమాగా నిలించిందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పుష్ప-2 అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలిచినట్లు తెలుస్తోంది. కాగా ‘దంగల్’ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా ‘బాహబలి-2’ సెకండ్ స్థానంలో ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మూవీ రూ.1414 కోట్ల వసూళ్లును రాబట్టింది.