Prashant Varma: మనకు ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలి.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పోస్ట్

యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashant Varma) కాంబినేషన్‌లో ‘జాంబీ రెడ్డి (Zombie Reddy), హనుమాన్ (Hanuman)’ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-12-01 15:20 GMT

దిశ, సినిమా: యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashant Varma) కాంబినేషన్‌లో ‘జాంబీ రెడ్డి (Zombie Reddy), హనుమాన్ (Hanuman)’ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. జాంబీ రెడ్డి పర్వాలేదు అనిపించుకున్నా.. హనుమాన్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ (blockbuster hit) సొంతం చేసుకుంది. దీంతో.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా ఇద్దరికి టాలీవుడ్ (Tollywood)తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అంతేకాదు.. ప్రతీ ఒక్కరు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ క్రమంలోనే తేజా సజ్జా.. తనకు ఈ ఏడాదిలో వచ్చిన బెస్ట్ కాంప్లీమెంట్ (Best Complement) అంటూ బాలీవుడ్ స్టార్ (Bollywood Star) హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)తో దిగిన ఫొటో చేశారు. అయితే.. ఈ ట్వీన్‌ను ట్యాగ్ చేస్తూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘ఫొటో క్రెడిల్ లేదా పుష్పా’ అని పరోక్షంగా ఆ ఫొటో తానే తీసినట్లు చెప్పకనే చెప్పాడు.

దీనిపై స్పందించిన తేజ.. ‘కృష్ణ’ మూవీలో బ్రహ్మనందం ‘వచ్చేశాడు’ అనే డైలాగ్ చెప్పిన చిన్న క్లిప్‌ను రిప్లై ఇచ్చాడు. అంతటితో ఆగని ప్రశాంత్ వర్మ.. మరోసారి తేజ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘మనకి ఏం కావాలన్నా మనమే అడిగి తీసుకోవాలి అని ఒక పెద్దాయన చెప్పాడు’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

Tags:    

Similar News