Akkaḍa ammayi ikkaḍa abbayi: మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రదీప్ మాచిరాజు సెన్సేషనల్ కామెంట్స్.. ఆ విలేజ్‌లో?
నితిన్-భరత్ ద్వయం దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ

దిశ, వెబ్‌డెస్క్: నితిన్-భరత్ ద్వయం దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkaḍa ammayi ikkaḍa abbayi). ఈ మూవీలో బుల్లితెర ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju)కథానాయకుడిగా నటిస్తున్నారు. అలాగే తోటి లేడీ యాంకర్ దీపికా పిల్లి ప్రదీప్ సరసన కీలక పాత్రలో నటిస్తుంది. ఇక సత్య, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జాన్ విజయ్ జీఎమ్ సుందర్, రోహిణి, ఝాన్సీ వంటి తదితరులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
ఈ రొమాంటిక్ చిత్రానికి రాధన్ సంగీతాన్ని సమకూర్చగా.. ఎంఎన్ బాలరెడ్డ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ ఎంటర్‌టైనర్ సినిమాను మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఏప్రిల్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల జనాల్ని ఆకట్టుకునే స్టోరీ అని తెలిపాడు.
తప్పకుండా నెటిజన్లు ఎంటర్‌టైన్ అవుతారని.. వినోదాత్మక చిత్రంగా నిలుస్తుందని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. నన్ను ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. నన్ను ఎలాంటి పరిస్థితుల్లో పెడితే కథలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో బాగా తెలుసు కాబట్టి వాళ్లు అలాగే ఈ సినిమాను చేశారని అన్నాడు. కాగా ఫస్ట్ టైమ్ ఆ లైన్ చెప్పినప్పుడే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందని తెలిపాడు.
ఇందులోని ఫైట్లు, యాక్షన్లు, భారీ భారీ డ్యాన్సులు అని కాదు.. ఒక సరదా ఎన్విరాన్మెంట్‌లో, ఒక ఊర్లో, ఒక ఊరు పరిస్థితుల్లో నేను ఇరుక్కుపోవడం అనేది అండ్ ఆ వింత కండిషన్స్ అన్నింటిని నేను ఫాలో అవ్వడం మీరు ఫస్ట్ సాంగ్‌లో చూసి ఉంటారని వెల్లడించాడు. నాకు కళ్లకు గంతలు కట్టి ఊర్లో తిప్పుతూ ఉంటారని చెప్పాడు. ఇంటనీర్‌ను కళ్లగంతలు కట్టి తిప్పితే ఏమవుద్దో సినిమాలో ఉంటుందని అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.