‘ఓ వెన్నెలా.. నా రాణిలా..’ అంటూ ఆ నటితో స్టెప్‌లేసిన టాలీవుడ్ యంగ్ హీరో

: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Update: 2025-01-03 12:48 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఈ రోజు ఆయన పుట్టిన రోజు కావడంతో.. శ్రీనివాస్ నటిస్తున్న సినిమాల నుంచి ఒక్కో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఒకటైనా ‘భైరవం’ (Bhairavam)నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘అరే.. గుండెలోన చప్పుడే లవ్వు గంట కొట్టెరో.. నేలపైన అడుగులే కొత్త స్టెప్పు వేసేరో.. ఓ వెన్నెలా నా రాణిలా నూరేళ్లెలా ఉండిపో ఇలా’ అంటూ సాగే ‘ఓ వెన్నెలా’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్(Nara Rohith), మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రల్లో కనిపించనుండగా.. అదితి శంకర్(Adithi Shankar), దివ్య పిళ్లై(Divya Pillai), ఆనంది (Anandi)హీరోయిన్లుగా నటిస్తున్నారు. మల్టీ స్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్, శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్స్‌పై జయంతి‌లాల్ గదా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News