Devara: మనల్ని ఎవడ్రా ఆపేది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ.. దేశవ్యాప్తంగా ‘దేవర’ సెలబ్రేషన్స్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR), కొరటాల శివ(Koratala Siva) కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం దేవర(Devara).

Update: 2024-09-27 02:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR), కొరటాల శివ(Koratala Siva) కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం దేవర(Devara). ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 27న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్(Jahnavy Kapoor) హీరోయిన్‌గా నటించింది. అయితే నేడు దేవర రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా మొదటి షోకే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా జై ఎన్టీఆర్ అనే నినాదం మారుమ్రోగుతోంది. ఆర్ టీ సీ క్రాస్ రోడ్స్‌ సుదర్శన్ 35mm థియేటర్ వద్ద అర్ధరాత్రి సమయంలో ఎన్టీఆర్ ఫాన్స్‌తో పండగ వాతావరణం నెలకొంది. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలతో అభిమానులు హోరెత్తించారు.

ఇక అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు. ఇక ఎన్టీఆర్ సాంగ్స్, డప్పులతో మోత మోగించారు తారక్ ఫ్యాన్స్. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమాను పండగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్‌కు భారీ కటౌట్స్ పెట్టారు. అలాగే విదేశాల్లోనూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు బొమ్మ బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. దీంతో తారక్ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది.


Similar News