Nidhi Agarwal: హరిహర వీరమల్లు పై ఆ డైలాగ్‌తో అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన యంగ్ బ్యూటీ..(పోస్ట్)

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ‘హరిహర వీరమల్లు’.

Update: 2024-12-02 05:13 GMT

దిశ, సినిమా: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ‘హరిహర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతోంది. అయితే మొదటి భాగం ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా 2025 మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. కాగా ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. తాజాగా నిధి అగర్వాల్ ఆమె నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుండి పవన్ లేటెస్ట్ లుక్ ఒకటి షేర్ చేసింది. దానికి పవన్ చెప్పిన ఓ డైలాగ్ కూడా జోడించింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బియ్యం అక్రమ రవాణాని అడ్డుకుని ‘సీజ్ ది షిప్’ అని అన్న డైలాగ్ ఎంత వైరల్‌గా మారిందో తెలిసిందే. అయితే ఈ డైలాగ్‌ని నిధి ఆ ఫొటోకి జోడించింది. దీంతో నిధి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Tags:    

Similar News