Radhika Apte : నందమూరి హీరోను చెప్పుతో కొడతానన్న హీరోయిన్
హీరోయిన్ రాధిక ఆప్టే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. నందమూరి స్టార్ హీరోపై పరోక్షంగా ఘాటు కామెంట్లు చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ రాధిక ఆప్టే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. నందమూరి స్టార్ హీరోపై పరోక్షంగా ఘాటు కామెంట్లు చేసింది. సాధారణంగా ఎవరైనా సరే స్టార్ సెలబ్రిటీలను పల్లెత్తు మాట అనడానికి బయపడుతుంటారు. అలాంటిది ఈ హీరోయిన్ నందమూరి హీరోను చెప్పుతో కొడుతానని వార్నింగ్ ఇచ్చిందట. తాను తెలుగు సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో నాతో కాస్త అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆయన బిహేవియర్ నాకు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ఆయన్ను చెప్పుతో కొడతానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను.’’ అంటూ రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది. ఈ వార్త చూసిన నందమూరి ఫ్యాన్స్ ఈమెపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నందమూరి హీరోల వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోకుండా ఇలాంటి చెత్త కామెంట్లు చేయడం సరికాదని రాధికపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.