Mogastar Chiranjeevi with Srikanth Odela: నాని డైరెక్టర్‌తో మెగాస్టార్ సినిమా.. నెట్టింట పోస్ట్ వైరల్
యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela).. నేచురల్ స్టార్ నాని (Nani) ‘దసరా’ చిత్రంతో టాలీవుడ్ (Tollywood) లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
దిశ, సినిమా: యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela).. నేచురల్ స్టార్ నాని (Nani) ‘దసరా’ చిత్రంతో టాలీవుడ్ (Tollywood) లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ ప్రాజెక్టుగా ఇటీవల నానిఓదెల-2 (Naniodela-2) అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ ప్రజెంట్ చిత్రీకరణ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌కి స్టార్ హీరోల నుండి చాలా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో సినిమా అనేది డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డ్రీమ్.
ఈ క్రమంలోనే తన మూడో చిత్రంగా మోగాస్టార్‌తో సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు డైరెక్టర్. ఇందులో భాగంగా ఇప్పటికే చిరంజీవి దగ్గరకు వెళ్ళడం ఆయన్ని కలవడం, ఆయనతో సినిమా ఓకే అయిపోవడం అన్నీ జరిగిపోయాయని ఫిలీమ్ వర్గాల నుంచి టాక్ విపిస్తోంది. ఆల్‌మోస్ట్ కన్ఫార్మ్ (Almost Conform) అయిన ఈ సినిమాను భారీ బడ్జెట్ (Big budget)తో తెరకెక్కించే పనిలో ఉన్నాడట ఓదెల. అయితే.. నాని ది ప్యారడైజ్ తర్వాత ఆ సినిమా వర్క్ మొదలు కానున్నట్లు సమాచారం. అంతే కాదు దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. ఇక మూడో సినిమాకే మెగాస్టార్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? తన ఫేవరెట్ హీరోని శ్రీకాంత్ ఓదెల ఎలా ప్రెజెంట్ చేస్తాడు అనేది వేచి చూడాల్సి ఉంది.