Vishwak Sen: వచ్చేసిన విశ్వక్ లైలా లుక్.. ఎలా ఉన్నాడంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’ (Laila).

Update: 2024-12-25 09:39 GMT

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’ (Laila). ఇందులో విశ్వక్ డిఫరెంట్ (different) పాత్రలో కనిపించనుండగా.. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ (First Look) పోస్టర్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ (curiosity) పెరిగింది. ఇందులో ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుంది. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న లవర్స్ డే (Lover's Day) స్పెషల్‌గా ‘లైలా’ థియేటర్స్‌లో సందడి చేయనుంది.

ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో వరుస అప్‌డేట్స్ (Updates) ఇస్తూ సందడి చేస్తున్నారు చిత్ర బ‌ృందం. ఇందులో భాగంగా.. తాజాగా ‘లైలా’ నుంచి విశ్వక్ సేన్ మోడల్ లుక్ (Model look) రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో విశ్వక్ సేన్ బ్లాక్ కలర్స్ గాగుల్స్ (Black Color Goggles) ధరించి స్టైల్‌గా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అలాగే ఒక చేతిపై సోను లవర్ (Sonu Lover) అని మరో చేతిపై సోను కిల్లర్ (Sonu Killer) అని రాయించుకున్నాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ స్టైలిష్‌గా ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News