Sai Dharam Tej: మెగా మాసివ్.. సాయి ధరమ్ తేజ్ ‘SDT18’ నుంచి బిగ్ అప్డేట్‌ ఇచ్చిన మేకర్స్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ‘SDT 18’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Update: 2024-12-08 13:12 GMT

దిశ, సినిమా: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ‘SDT 18’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంతోనే రోహిత్ కేపీ(Rohit KP) దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. దీనిని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్(Primeshow Entertainments) బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi)హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా, ‘SDT 18’ మూవీ అప్డేట్ రాబోతున్నట్లు తెలుపుతూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 9న ఉదయం 11:07 గంటలకు మెగా మాసివ్(Mega Massive) అప్డేట్ వచ్చేస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా డిసెంబర్ 12న టైటిల్, గ్లింప్స్ రాబోతుందని తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

Tags:    

Similar News