Megastar Chiranjeevi: చిరంజీవి బర్త్ డేకి ఆసక్తికర ఫోటో షేర్ చేసిన మెగా హీరో

చిరంజీవి బర్త్ డేకి ఆసక్తికర ఫోటో షేర్ చేసిన మెగా హీరో

Update: 2024-08-22 08:17 GMT

దిశ, సినిమా : ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ తో పాటు ఎంతోమంది సినీ నటులు ఆయనకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. మరి కొందరైతే చిరుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఓ యంగ్ హీరో చిరంజీవి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసాడు. ఎవరు ఆ హీరో అని ఆలోచిస్తున్నారా? అతను ఎవరో కాదండి .. మెగా కుటుంబానికి చెందిన హీరోనే. కొణిదెల నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ తన చిన్నప్పుడు పెదనాన్న చిరు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోని, అలాగే అతని పెళ్లిలో చిరంజీవిని హాగ్ చేసుకున్న ఫోటోని షేర్ చేసి బర్త్ డే విషెస్ తెలిపాడు. ఆ ఫొటోలో చిరు ఫాదర్ కూడా ఉన్నారు.

ఈ ఫోటో కింద.. పెద్ద నాన్న ఏ సమస్య వచ్చిన చిరు నవ్వుతో ఎదుర్కోమని నేర్పించారు, ప్రేమ, అనుభంధాలతో మమ్మల్ని పెంచినందుకు మీకు చాలా థాంక్స్.. నువ్వే మా అందరికి అతి పెద్ద ఆదర్శం. హ్యాపీ బర్త్ డే డాడీ అంటూ ఎమోషనల్ గా పోస్ట్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

Full View

(video credits to varun tej konidela instagram id)


Similar News