Siddharth: రెండోసారి పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్.. నెట్టింట ఫొటోలు వైరల్

స్టార్ హీరో సిద్దార్థ్(Siddharth), అదితీ రావు హైదరీ(Aditi Rao Hydari) ‘మహాసముద్రం’ సినిమా సమయంలో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-27 10:03 GMT
Siddharth: రెండోసారి పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్.. నెట్టింట ఫొటోలు వైరల్
  • whatsapp icon

దిశ, సినిమా: స్టార్ హీరో సిద్దార్థ్(Siddharth), అదితీ రావు హైదరీ(Aditi Rao Hydari) ‘మహాసముద్రం’ సినిమా సమయంలో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరు సీక్రెట్‌గా కొద్ది కాలం ప్రేమించుకున్నారు. వనపర్తి(Wanaparthy)లోని రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగిన చోటే పెళ్లి(Wedding) చేసుకున్నారు. తాజాగా, మరోసారి సిద్దార్థ్, అదితీ  పెళ్లి చేసుకున్నారు.

రాజస్థాన్‌(Rajasthan)లోని అలీలా ఫోర్ట్‌లో డిస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని ట్రెండ్ ఫాలో అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, డెస్టినేషన్ వెడ్డింగ్‌(Destination Wedding)ను ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలంతా ఫాలో అవుతున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ తమకు ఇష్టమైన ప్రదేశంలో మళ్లీ చేసుకుని తమ కోరికను నెరవేర్చు కుంటున్నారు. ఇప్పుడు అదే ట్రెండ్‌ను సిద్దు-అదితీ ఫాలో కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Full View

Full View

Tags:    

Similar News