రిజల్ట్ ఆఫ్ గ్రేట్ క్లాస్ అంటూ షాకింగ్ ఫొటో షేర్ చేసిన మెగా డాటర్.. అయ్యో టేక్ కేర్ అంటున్న నెటిజన్లు

మెగా డాటర్ నిహారిక కొణిదెల(NIHARIKA KONIDELA) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-03-22 08:12 GMT
రిజల్ట్ ఆఫ్ గ్రేట్ క్లాస్ అంటూ షాకింగ్ ఫొటో షేర్ చేసిన మెగా డాటర్.. అయ్యో టేక్ కేర్ అంటున్న నెటిజన్లు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల(NIHARIKA KONIDELA) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కానీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నది. అలా ఫస్ట్‌గా తీసిన మూవీ ‘కమిటి కుర్రోళ్లు’(Comittee Kurrollu). తన ఫస్ట్ చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దీంతో ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది.

ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. నిహారిక చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda) అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. కానీ పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తమ తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అలాగే నిత్యం ఫ్రెండ్స్‌తో వేకెషన్స్‌కు వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ స్టోరీ పెట్టింది. అందులో..‘రిజల్ట్ ఆఫ్ గ్రేట్ క్లాస్.. థ్యాంక్యూ అంటూ శరన్ జిత్ కౌర్‌ను ట్యాగ్ చేసింది. అలాగే పాదాలపై చారలు ఉన్న ఫొటో షేర్ చేసింది. అయితే నాట్యం నేర్చుకునే క్రమంలో గజ్జలు కట్టుకోవడం వల్ల ఇలా తన పాదాలు అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అయ్యో జాగ్రత్త అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News