Samantha: అక్కడ సమంత సాహసాలు.. వీడియోలు చూస్తే ప్రతీఒక్కరికీ చెమటలు పట్టాల్సిందే..?

సినీ ఇండస్ట్రీల్లో అండ్ తెలుగు ప్రజల్లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్ అంతా ఇంతా కాదు.

Update: 2025-03-23 13:48 GMT
Samantha: అక్కడ సమంత సాహసాలు.. వీడియోలు చూస్తే ప్రతీఒక్కరికీ చెమటలు పట్టాల్సిందే..?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీల్లో అండ్ తెలుగు ప్రజల్లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు సినిమాలు హిట్, ప్లాప్ ఏ టాక్ సొంతం చేసుకున్నా.. ఆల్ టైమ్ సమంత ఫ్యాన్స్ అని చెప్పుకునే కుర్రాళ్లతో సహా అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ అమ్మడు తెలుగులో అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తన అందం, నటన, అభినయం, అమాయకత్వం, డ్యాన్స్‌‌తో మెప్పించిందనడంలో అతిశయోక్తిలేదు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సనిమాల్లో అవకాశాలు కొట్టేసి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఒక సంవత్సరం మయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ సినిమాల బాట పట్టిన సమంత సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌ల్లోనూ తన సత్తా చాటుతుంది. ఇప్పటికే తను నటించిన సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన సామ్ నటించింది. ప్రజెంట్ ఈ హీరోయిన్ మరొక వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇకపోతే సమంత తన వ్యక్తిగత, వృత్తిపర విషయాన్ని సోషల్ మీడియా వేదికన తన అభిమానులతో పంచుకుంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ జిమ్‌లో చెమటలు చిందిస్తోన్న ఓ వీడియో ఫ్యాన్స్‌తో పంచుకోగా.. సామ్ భారీ వర్కౌట్స్ చూసి స్టన్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Full View

Tags:    

Similar News