Robinhood Trailer: ‘రాబిన్‌ హుడ్‌’ నుంచి ట్రైలర్ రిలీజ్.. డేవిడ్‌ వార్నర్‌ ఎంట్రీ అదుర్స్

వెంకీ కుడుముల (Venky Kudumula)దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాబిన్ హుడ్ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Update: 2025-03-23 15:23 GMT
Robinhood Trailer: ‘రాబిన్‌ హుడ్‌’ నుంచి ట్రైలర్ రిలీజ్.. డేవిడ్‌ వార్నర్‌ ఎంట్రీ అదుర్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: వెంకీ కుడుముల (Venky Kudumula)దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాబిన్ హుడ్ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ హీరో నితిన్ (Nitin) కథానాయకుడిగా నటించగా.. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌(Mythri Movie Makers Banners)పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు జీవీ ప్రకాశ్ కుమార్ (G.V. Prakash Kumar)సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయితే నేడు (మార్చి 23) హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.

అలాగే ఈ క్రమంలో రాబిన్ హుడ్‌(Robin Hood)లో సెకండ్ హాఫ్‌లో డేవిడ్ వార్నర్ (David Warner)రోల్ ఉంటుందని మూవీ టీమ్ ప్రకటించింది. ట్రైలర్‌లో కూడా డేవిడ్ కనిపించారు. హెలికాప్టర్ నుంచి దిగుతూ.. లాలీపాప్ తింటూ నడుస్తోన్న సన్నివేశంలో ఈయన కనిపించడంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రైలర్ లో యాక్షన్ సీన్స్, కామెడీ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం మార్చి 28 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. 

READ MORE ...

‘రాబిన్ హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చేసిన స్టార్ క్రికెటర్.. ఆకట్టుకుంటున్న వెల్కమ్ విషెస్ ఫొటోలు

Full View
Tags:    

Similar News

Monami Ghosh