Raj Tarun - Lavanya : రాజ్ తరుణ్ - లావణ్య కేసులో కీలక వ్యక్తి అరెస్ట్

నటుడు రాజ్ తరుణ్ - లావణ్య కేసు(Raj Tarun - Lavanya Case)లో మరో బిగ్ ట్విస్ట్.

Update: 2025-02-03 11:51 GMT
Raj Tarun - Lavanya : రాజ్ తరుణ్ - లావణ్య కేసులో కీలక వ్యక్తి అరెస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : నటుడు రాజ్ తరుణ్ - లావణ్య కేసు(Raj Tarun - Lavanya Case)లో మరో బిగ్ ట్విస్ట్. ఈ కేసులో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా గతంలో రాజ్ తరుణ్ తో జరిగిన గొడవల్లో.. లావణ్య ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు(Narsingi Police) సోమవారం మస్తాన్ సాయి(Masthan Sai) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. తాము విడిపోవడానికి ప్రధాన కారణం మస్తాన్ సాయి అని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొనగా.. దీనిపై మస్తాన్ సాయిని విచారిస్తుండగా విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రేమ, పెళ్లి పేరుతో వల విసిరి పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ పై ఆరోపణలు కూడా ఉండగా.. ప్రైవేట్‌ వీడియోల(Private Videos)తో అమ్మాయిలతో బ్లాక్ మెయిల్‌(BlackMail)కు కూడా పాల్పడుతున్నట్లు పోలీసుల గుర్తించారు.

అదే విధంగా లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేసి.. వాటిని ఆమెకు పంపి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. మస్తాన్ పై ఫిర్యాదు చేసినపుడు సాక్ష్యాలుగా ఆ వీడియోలను కూడా లావణ్య పోలీసులకు అందజేశారు. ఈ వీడియోల వలనే రాజ్ తో తనకి గొడవలయ్యాయి అని, తాము విడిపోవడానికి మస్తాన్ ముఖ్య కారకూడని లావణ్య పేర్కొంది. నేడు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అవన్నీ నిజమేనని తేలింది. అలాగే మస్తాన్ దగ్గర స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లో 200 వీడియోలకుపైగా ఉన్నట్లు కూడా తేల్చారు నార్సింగి పోలీసులు. కాగా మస్తాన్ సాయి గతంలో డ్రగ్స్ కేసు(Drugs Case)లో అరెస్ట్ అయినట్టు పోలీసులు తెలియ జేశారు. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్టు సమాచారం. 

Tags:    

Similar News

Tamannaah Bhatia