అన్ని విషయాల్లో ఇతరులను నమ్మడానికి లేదు.. మెగా బ్యూటీ షాకింగ్ కామెంట్స్
ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా(Genelia) ‘బాయ్స్’ సినిమాతో వచ్చి తన క్రేజీనెస్‌తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.
దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా(Genelia) ‘బాయ్స్’ సినిమాతో వచ్చి తన క్రేజీనెస్‌తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక రామ్ చరణ్ సరసన ‘ఆరెంజ్’(Orange) మూవీలో నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు వెంకటేష్(Venkatesh), ఎన్టీఆర్, అల్లు అర్జున్(Allu Arjun), వంటి స్టార్స్‌తో నటించి మెప్పించింది. కొద్ది కాలంపాటు ఇండస్ట్రీలో రాణించింది. తెలుగు, తమిళ మూవీస్ చేసిన జెనీలియా ఎంతోమంది ఫాలోవర్స్‌ను దక్కించుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్ రితేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత జెనీలియా పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత ‘వేద్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి ఘన విజయం సాధించింది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘కెరీర్ పరంగా సక్సెస్, ఫెయిల్యూర్‌కు నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వను. జయాపజయాలు మన జీవితంలో భాగమే. కాబట్టి, వాటి కంటే కూడా మనం ఎలా జీవితాన్ని కొనసాగిస్తున్నామన్నదే ముఖ్యం. ఒక నటిగా దాదాపు ఆరు భాషల్లో పనిచేశా. పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్‌కు దూరం కావాలనిపించింది. మళ్లీ ఇటీవల కమ్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు తెలిసిన వాళ్ళెవరూ ప్రోత్సహించలేదు. పదేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నావా? అని అన్నారు. అలాగే వర్కౌట్ కాదు అని నిరాశ పరిచారు. ధైర్యం చేసి సినిమాల్లోకి తిరిగి వచ్చాను. 10 ఏళ్ల తర్వాత నేను నా భర్తతో కలిసి నటించిన ‘వేద్’ విజయం సాధించడం సంతోషంగా ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో ఇతరులను నమ్మడానికి లేదు. అసలు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఇతరుల ఓపీనియన్ అడకుండా ఉండటమే మంచిది’’ అని చెప్పుకొచ్చింది.