Unni Mukundan: ‘మార్కో’ తెలుగు ట్రైలర్ విడుదల.. వైల్డ్ లుక్‌లో దర్శనమిచ్చి షాకిచ్చిన ఉన్ని ముకుందన్

మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan) నటించిన తాజా చిత్రం ‘మార్కో’(Marco).

Update: 2024-12-28 10:19 GMT

దిశ, సినిమా: మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan) నటించిన తాజా చిత్రం ‘మార్కో’(Marco). దీనికి హనీఫ్ అదేని(Hanif Adeni) దర్శకత్వం తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను క్యూబ్స్ ఎంటర్‌టైన్‌‌మెంట్స్(Cubes Entertainments) బ్యానర్‌పై షరీష్ మహమ్మద్ నిర్మించారు. ఇందులో యుక్తి తరేజా, కబీర్ దుహాన్ సింగ్(Kabir Duhan Singh) కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా ఇప్పటికే కేరళలో రిలీజ్ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎన్వీఆర్ సినిమా తెలుగులో జనవరి 1న విడుదల చేయనున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటించారు.

ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘మార్కో’ తెలుగు ట్రైలర్‌(Trailer)ను విడుదల చేశారు. ‘‘జీవితంలో మనల్ని బాధపెట్టే విషయం ఏంటో తెలుసా.. మన కళ్ల ముందే మనకు ఎంతో ఇష్టమైన వాళ్లను చిత్రహింసలు పెట్టి చంపడం’’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది. ఇందులో ఉన్ని ముకుందన్(Unni Mukundan) వేట మొదలెట్టి శత్రువులను చీల్చీ చెండాడుతాడు. అంతేకాకుండా చివరకు కత్తితో అందరినీ నరికేసి నోట్లో ఏదో ముక్క నోట్లో పెట్టుకుని రక్తంతో కనిపించి అందరికీ షాకిచ్చాడు. ప్రస్తుతం ‘మార్కో’ ట్రైలర్(Trailer) ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో ఉన్ని ముకుందన్ వైల్డ్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.


Read More..

ఓటీటీలో సరికొత్త రికార్డ్ సాధించిన వరుణ్ ‘నింద’ సినిమా.. 


Full View


Tags:    

Similar News